పుట:SamskrutaNayamulu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
240

సంస్కృతన్యాయములు

(1) ఇందు శ్రుత్యుద్ధిష్టక్రమము ననుసరించుట శ్రుతిక్రమము.

(2) వాక్యములు వ్యత్యస్తములుగానున్నను అర్ధమునిబట్టి విధియందు ప్రవర్తించుట అర్ధక్రమము

ఉదా:--అగ్నిహోత్రం జుహోత్యోదనం పచతి--మున్నగు వానివలె.

(3) సూక్తములయందు నుడువబడిన పాఠముయొక్క వరుస నతిక్రమింపక క్రమముగ విధులయందు ప్రవర్తించుట పాఠక్రమము.

ఉదా:--సమిధో యంతి; తనూనపాతం యజతి; ఇడోయజతి; బర్హిర్యజతి; స్వాహాకారం యజతి--మున్నగు వానివలె. ఇందుతొలుత సమిత్తు, తరువార అగ్నిహోత్రుని, ఇట్లువరుసగ యజింపవలెను.

(4) అనుభవమును ఆచారమునుబట్టి విధులయందు ప్రవత్రించుట ప్రవృత్తిక్రమము.

ఏతావాతా చెప్పినది చెప్పినట్లు క్రమము తప్పక పనులయందు ప్రవర్తించునపు డీన్యాయము ప్రవర్తించునని యెఱుంగనగును.

పిత్రనుసృతస్తనంధయన్యాయము

తండ్రి ననుసరించిన బాలునివలె.

తత్వవేత్త ననుసరించిన అతత్త్వవేత్తయు వానివలన నుద్ధరింప బడును.