పుట:SamskrutaNayamulu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
239

సంస్కృతన్యాయములు

పంజరమునుండి విడువబడి చిలుక తిన్నగా ఆకాశముకెగిరిపోవును. అట్లే---

సంసార (దేహాది) బంధనిర్ముక్తజీవుడును ఊర్ధ్వగమనమునొందును.

ఏరండబీజ, జలతుంబికా న్యాయములను జూడుము.

పదార్ధానుసమయన్యాయము

ఈన్యావివరణము కాండానుసమయ న్యాయమున గావింపబడినది.(చూదుడు)

పర్ణమయీన్యాయము

పర్ణమయి అనగా మోదుగకఱ్ఱతో చేయ;బడిన స్తుక్కు. ఈస్రుక్కు ప్రతియొక్క యజ్ఞమునందును ఉపయోగింపబడును. అసలు స్తుక్కు లెనిదే యజ్ఞము జరుగదుకూడ. కావున విధిగ )అన్నికర్మలయందు) అన్నితావుల నుపయోగింపబడు సాధన విశేషమున నీన్యాయ ముపయోగింపబడును.

గోదోహనన్యాయమున కియ్యది విరుద్ధము

పాతక్రమన్యాయము

సూత్రపఠితమైన పాఠక్రమము నతిక్రమింపక విధులయందు ప్రవర్తిచునట్లు.

శ్రుతిక్రమము, అర్ధక్రమము, పాఠక్రమము, ప్రవృత్తి క్రమము,స్థానక్రమము, ముఖ్యక్రమము అని క్రమము ఆఱువిధములు.