పుట:SamskrutaNayamulu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
237

సంస్కృతన్యాయములు

ఎట్టిస్థితియందైనను వస్తువులు తమధర్మమును బాయవూఅని న్యాయముయొక్క ఆశయము. తలగొరిగించి రుద్రాక్షలు వేసికొనినంతమాత్రమున చోరుడు తనచొరత్వమును కప్పిపుచ్చలగలడా? చూచిన వారల్ల ఱితడు చొరుడు అనియే అందురు.

ధారావాహికన్యాయము

తైలదిధారవలె అవిచ్చన్నముగ నొకవస్తువు నెఱిగి కొనుటా.

ఏవస్తువును గూర్చి మనము విచారింపంబూనుదమో ఆవస్తువు కంటి కగపడినను, లేకున్నను, క్షణములోనశించినను, నశించకఫోయినను, మఱొకరకముగ స్వరూపభేదము నొందినను, లేకున్నను, ఎట్టిస్థితియందైన గానిండు-తద్విషయకవిచారముమాత్ర మవిచ్చిన్నముగ తదేకనిష్ఠగ కొనసాగుటను ధారాహికన్యాయము తెలుపును. తైలధారవలె అవిచ్చిన్నమై తదేకనిష్ఠతో నొనర్పబడు నేదేనియొకవస్తువిచారమున నీ న్యాయము ప్రవర్తించును. ఉదా:- తైలధారావదవిచ్చిన్నపరమాత్మోపాస్తి.

నర్తకన్యాయము

నాట్యగాం డొకడే పలువుర కానందము కలిగించునట్లు. ఒకేదీప మనేకులకు ప్రకాశాము నిచ్చును.

నటి ఒకరితయే అనేకులను భ్రూభంగమున పులకితశరీరుల జేయును.