పుట:SamskrutaNayamulu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
236

సంస్కృతన్యాయములు

దీర్ఘశష్కులెభక్షణన్యాయము

శాష్కులీ అనగా నేతితో కాల్చబడిన గోధిమరొట్టె పెద్ద గోధుమరొట్టెను ఒకమూల మొదలిడి తినువాని దానిఆకారము, దీర్ఘత్వము, మొత్తదనము, గట్తిదనము, ఉప్పదనము, తీపి, (రుచి అని భావము) మున్నగు ననేక విషయములజ్ఞాన మొకమాఱు గలుగును.

అట్లే--యౌగపద్యమున ననేకవస్తుజ్ఞానము కలుగునపుడీన్యాయ ముపయోగింపింపబడును.

"సుగంధిం శీతల్లం దీర్ఘా మశ్నస్త: పూపశాష్కులీం, కపిల బ్రాహ్మణస్సిన్తి యుగప త్పంచబుద్ధయ:"

దూరస్థవనస్పతిన్యాయము

చాలాదూరమునుండి చూచినవృక్షము, దానియందున్న వస్తువులు నొకటియై అభేదముగ గన్నట్టును.

"షడ్భి: ప్రకారై స్సతాం భావానా మనుపలబ్ధి ర్భవ త్యతిసన్నికర్షా దతివిప్రకర్షా న్మూర్త్యం తరవ్యవధానా త్తమసావృతత్వా దిన్ద్రియదౌర్బల్యా దరిప్రమదా దితి."

దేవదశౌర్యన్యాయము

దేవదత్తుని శౌర్యమువలె.

దేవదత్తుని శౌర్యము వాని దేశామునందు ప్రసిద్ధమే అతడు దేశాంతరమున కేగిన అట నత డవిజ్ఞాతు దావుటా వానిశౌర్యము వెల్లడికాదు. అంతమాత్రమున నానిశౌర్యము పోవునా? పోదు.