పుట:SamskrutaNayamulu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
235

సంస్కృతన్యాయములు

పెట్టుకొనును. అది చూచి వెంటనే ఎదిరిరాజు వానిని చంపక మానివేయును. ఇది యుద్ధధర్మము. కావున--ప్రాణాత్యయసమయమున గడ్డితినిన మహాశత్రువులు సయితము రక్షిల్ంపబడుదురు. ఎల్లకాలము గడ్డియే తిని బ్రతుకు జంతువులేల అకరుణముగ చంపబడుచున్న వోగదా!

తైలపాత్రధరన్యాయము

నూనెకుండను మోయువానివలె. నూనెకుండను నెత్తిపై నిడుకొని పోవువాడు కడుజాగరూకతతో తదాయత్తచిత్తమున నూనె తొణికిపోకుండ అడుగులో అడుగులు వైచుచు పోవుచుండును.

"తైలపాత్రధరో యద్వ దసిహస్తై రధిష్ఠిత: స్ధలితే మరణత్రాసా త్తత్పర స్స్యాత్తివ్రతీ" స్ద్గకుతమవునెడ ప్రాణాపాయము సంభవించు నను భయమున నూనెకుండమోయువానివలె వ్రతినిష్ఠుడును తత్పరుడై యుండవలెను.

తదేకనిష్ఠయుందీ న్యాయ ముపయుక్తము

దండిన్యాయము

ఫలానామనిషియని చూపుటకు ఆ "దడి" అనగా కఱ్ఱపట్టుకొనిపోవువాడు అని చూసినట్లు.

చత్రిన్యాయమును జూడుము.