పుట:SamskrutaNayamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

సంస్కృతన్యాయములు

అశ్వత్థపత్రన్యాయము
  • గాలి యున్నను లేకున్నను, రావియాకు కదలుచునే యుండును.
అక్ష్యండభేషజన్యాయము
  • కంటికి రాయు మందు బుడ్డకు రాచినట్టు.
ఆకాశభేదనన్యాయము
  • ఆకాశమును బ్రద్దలుచేయుటకు సాధన మేమియు లేదు.
ఆకాశముష్టిహననన్యాయము
  • ఆకాశమును పిడికిలిలో గ్రుద్దుటకు వీలులేదు.
ఆదర్శన్యాయము
  • అద్దమువలె నిర్మలముగ నుండుట.
ఆదర్శగజన్యాయము
  • పెద్దయేనుగు చిన్న యద్దములో గాసవచ్చును.
ఆదర్శమలినన్యాయము
  • అద్దమునకు మకిలి పట్టిన పోగొట్టుట సులభమే.
ఆమ్రవనన్యాయము
  • అనేక వృక్షజాతులుగల తోటలో కొన్నిమామిడిచెట్లున్నచో దానిని మామిడితోట యనునట్లు.
ఆమ్రసేకపితృతర్పణన్యాయము
  • మామిడిచెట్టు మొదటనే పితృతర్పణము చేసినచో చెట్టునకు నీళ్ళుపోసినట్టును, పితృతర్పణము చేసినట్లును అగును.