పుట:SamskrutaNayamulu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
229

సంస్కృతన్యాయములు

కాన్పించుదున్నది-- అని చెప్పిన మీదట నతడాభ్రాంతిని వీడి స్ధిరుండయ్యెనట.

ఓకవస్తువునందు అన్యవస్తుధర్మము లోపించి భ్రమించి ఆప్తవాక్యముచే తద్భ్రమనివృత్తి కలిగినపు డీన్యాయము ప్రవర్తించును.

జలకతకరేణున్యాయము

చిల్లగింజ నరుగదీసి బురదనీటిలో గలిపిన ఆగంధమునీటి బురదనుంఛి వేఱుపఱచి తా నదృశ్యమవును. "అజ్ఞానకలుషం జీవం జ్ఞానాబ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జ్జలం కతక రేణువత్." కతకరేణున్యాయమును జూడుము.

జాతేష్టిన్యాయము

జాతపుత్రుడు ఇష్టిచేయవలయును అన్నట్లు

కమదులు కలవాదు ఇష్టి చేల్యవలయును అన్నట్లు

కొమరులు కలవాడు ఇష్టిచేయవలను ననిన ఆచేయబడునిష్ట్యాదులు కుమారునిక్షేమముకొఱకా లేక తండ్రిక్షేమము కొఱకా అని సందేహము కలుగ పుత్రసంవేతుండవు తండ్రిక్షేమము కొఱకే అని సమాధాన మొసంగబడినది.

"నహి చైత్రానుష్ఠితాగ్నిహోత్రజనిత మపూర్వం చైత్రసమవేతం మైత్రం స్వర్గఫలభారినం కర్తు ముత్సహతే పుత్రేష్టిపితృయజ్ఞవ దేత త్స్యాత్! న! తత్రాప్యతిశయస్య పుత్రాదిసమువేతత్వేనైవాభ్యుపగమాత్."