పుట:SamskrutaNayamulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
228

సంస్కృతన్యాయములు

పాము పట్టుకొనినతరువాతగాని అది చుంచెలుక అని తెలిసికొన నేఱదు. చుంచెలుక అనిన పామునకు గిట్టదు. పైగా, అట్లు పట్టుకొని దానిని విడచిపెట్టిన పాముకు కండ్లు పోవునట. అందుకు వెఱచి తినిన పిచ్చియెక్కి పామునకు ప్రాణహాని సంభవించునట. అట్టి సమయమున పాము చేయవలసిన దేమి?

ముందు నుయ్యి, వెనుక గొయ్యి; ఎగదీసిన ఆత్మహత్య దిగదీసిన గోహత్య వంటి స్థలములయందు ఈన్యాయము ప్రవర్తించును. దశరఢుడు అసత్యమునకు పాల్పడి కైక మాట త్రోసివేయవలెనా? రాముని అరణ్యమునకు పంపివేయవలెనా?

చౌరాపరాధా న్మాండస్యవిగ్రహన్యాయము

దొంగలు చేసిన తప్పిదమువలన మాండవ్యునికి కొఱత సంభవించినట్లు.

"తస్మాన్న భేదప్రత్యక్షం సంప్రసర మితిచే త్కిం వస్తు స్వరూపభేదవాదినంప్రతి ఇమాని దూషణా న్యుద్ఘుష్యన్తే కిమ్నా ధర్మభేదవాదినంప్రతి ప్రధమే చౌరాపరాధాన్మాండవ్యవిగ్రహన్యాయాపాత:"

చాయాపిశాన్యాయము

ఒకడు తననీడను చూచి దయ్యమను భ్రాంతిచే భయపడుచుండ నాప్తు డొకడు-- ఇదిదెయ్యము కాదు; నీనీడ, చూచితివా, నీమెడలోని కంటె ఈనీడమెడలోను