పుట:SamskrutaNayamulu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
227

సంస్కృతన్యాయములు

చందనన్యాయము

చందనగంధముచందమున.

"యధా హరిచందనబిందు శ్శరీరైకదేశసంబద్ధో పి సన్ సకలదేహవ్యాపిన మాహ్లాదం కరో త్యేవ మాత్మాపి దేహైకదేశస్థ: సకలదేహవ్యాపినీ ముపలబ్ధిం కరిష్యతి" మంచిగంధపుబిందు వొకడు శరీరైకదేశమున నున్నను యావచ్చరీరమునకు నాహ్లాదము గూర్చునటులు శరీరములో నొకచో నున్నను ఆత్మ యావచ్చరీరవర్తియైభాసిల్లును.

చందనగుణన్యాయము

మంచిగంధపుచెక్కను అరుగ దీసినకొలది పరిమళము హెచ్చును. సువర్ణన్యాయమును జూడుము.

చంద్రజ్యోత్స్నాన్యాయము

చంద్రచంద్రికా న్యాయమును జూడుము.

చంపకపటన్యాయము

సంపెంగపూవులను బట్టలో కొంతతడ వుంచి నానిని తీసివేసినను సంపెంగవాసనమాత్రము పోదు.

రామఠకరండన్యాయము జూడుము.

చుచుందరీసర్పన్యాయము

చుందెలుకను పట్టుకొనిన పామువలె