పుట:SamskrutaNayamulu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226

సంస్కృతన్యాయములు

ఘటప్రదీపన్యాయము

ఘటములోని దీపమున్నట్లు. దీపద్వారమున ఘటము ప్రతీతమైనను దీపప్రకాశము నివర్తింపదు. అట్లే--

ఒకశాబ్దమువలన వ్యంగ్యార్ధము ప్రతీతమైనను నాక్యార్ధము దూరముకారు.

"యధైవహి ప్రదీపద్వారేణ ఘటప్రతీతా వుత్పన్నాయాం న ప్రదీపప్రకాశో నివర్తతే తద్వ ద్వ్యంగ్య ప్రతీతౌ నాచ్యావభాస్:"

ఘటారోహణన్యాయము

ఆభ్యాసముచేసిన కుండ పగిలిపోకుండ కుండపై నెక్కవచ్చును. అభ్యాసం కూసువిధ్య అన్నట్లు.

ఘటాల్పదర్పణన్యాయము

ఏనుగు చిన్నాద్దములో ఇమిడి చిన్నదిగా కనుపించును. కహాకాశము ఘటమందువలె.

ఘటీయంత్రస్థితఘటీన్యాయము

ఏతాముకుండలు ఒకటి క్రిందికి ఒకటి మీదికి పోవుచుండును.

ఉదా:-- కలిమెలేములు, కావడికుండలు, వృద్ధిక్షయములు, పాపపుణ్యములు.