పుట:SamskrutaNayamulu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
225

సంస్కృతన్యాయములు

మగలవలె మెలగజొచ్చిరి. ఒకనాడామె పెరుగమ్ముటకు పోవుచు త్రోవలో నెదురుదెబ్బతగిలి క్రిందపడెను. తలమీది పెరుగుబాన నేలపైబడి పెరుగు నేలపాలయ్యెను. అది చూచి ఆరాణి యిట్లనుకొనుచు నేదువదొడగెను---

"హత్వా నృపం పతి మావాప్య భుజంగదష్టం దేశాంతరే విధివశా ద్గణికాస్మిజాతా పుత్రం స్వకం సమధిగమ్య చితాం ప్రవిష్టా శోచామి గోపగృహిణి కధ మద్య తక్రమ్?"

అంతకంతకు భ్రష్టత్వము నొంది ఆపదలంబడినవారి విషయమున నీన్యాయము ప్రఫర్తించును.

గోమయఫృశ్చికన్యాయము

సదృశాత్సదృశోద్భవన్యాయమును జూడుము.

గ్రహైకత్వన్యాయము

"దశాపవిత్రేణ గ్రహం సమాష్టిన్" అనువాక్యమున "గ్రహం" అని ఏకవచనాస్తపదము ప్రయోగింబబడినది. "ఒకగ్రహమును" అని ఆ"గ్రహం" పదార్ధము. అయినను--"గ్రహములను" అనునర్ధము గ్రహింపబడుచున్నది.

అట్లే---ఏకవచనాంతపరముచేతనే తద్గుణకములవు ననేకములు గ్రహింపబడునపు డీన్యాయము ప్రవర్తించును.