పుట:SamskrutaNayamulu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
218

సంస్కృతన్యాయములు

కుసూలధాన్యన్యాయము

గాదెలోనుండి కొంచెముకొంచెముగా తీయుచుండిన క్రమముగా ఉన్నధాన్యమంతయు తగ్గిపోవును.

కూటకార్షావణన్యాయము

తెలియక్ చెల్లని నాణెములను వాడినట్లు.

సంచిలో బోసియుంచిన రూపాయలలో చెల్లనివికూడ నుండును. కాని మనము మామూలుగ తీసి వాడుచునేయుందుము. ఆవాడకములో చెల్లనినాణెములనుగూడ చూడక మంచివానివలెనే మామూలుగ వాడుచుందుము. తెలిసిన పిమ్మట వానిని తీసిపాఱవైతుము.

అట్లే--అజ్ఞానవశమున నొకదు అసాధుమార్గమున వ్యవహరించినను జ్ఞానము కలిగిన వెనువెంటన దానిని పరిత్యజించును.

కూపఖానకన్యాయము

"యధా కూపఖానకే పతిత పంకాది కూపా న్నిస్సృతే నాంభసా ప్రక్షాల్యతే తధా--"

నూయిత్రవ్వునప్పుడు ఒంటిపై పడిన మట్టి బురద మున్నగునవి ఆనూతిలోనుండి వచ్చిన నీటిచే కడిగికొని పరిశుభ్రము చేసికొనంబడును. అట్లే---

"తత్తద్విగ్రహావచ్చిన్నేశభేదబుద్దిజో దోష స్తదుపాసనా జన్య సుకృతమహిమ్నోత్పన్నేనాద్య్తతబోధేన సమూలం నివర్త్య ఇతి జ్ఞయమ్".