పుట:SamskrutaNayamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

సంస్కృతన్యాయములు

అభావవిరక్తి న్యాయము
  • ఒక విషయమై ప్రయత్నించి అది లభించనియప్పుడు 'దానితో మనకేమి ప్రయోజనము' అని విరక్తి జెందినయ ట్లభినయించుట.
  • 'లోతున పడిపోయిన కాని గంగార్పణం.'
అభ్రమయూరన్యాయము
  • మేఘమును జూచినచో నెమలికి సంతోషము.
అయస్కాంతసూచీన్యాయము
  • సూదంటురాయి సూదిని చటుక్కున నాకర్షించును.
అరణ్యరుదితన్యాయము
  • అడవిలో నేడ్చుచున్న వాని నాదరించి యోదార్చువారు లేరు.
  • అరణ్యరోదనము జైమినీ. 6-77.
అర్ధజరతీన్యాయము
  • శరీరమునందు కొంతభాగము వార్ధకమును, కొంతభాగము యౌవనమును గలిగియుండుట యసంభవము.(ముఖలావణ్యమున యువతియు, స్తనపతనమున జరతియు ననుట యుపపన్నము గాదు.)
అర్ధత్యాగసుఖన్యాయము
  • ధనము వ్యయము చేసిన సుఖము గల దనుట.