పుట:SamskrutaNayamulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
204

సంస్కృతన్యాయములు

అరఘట్టఘటీన్యాయము

ఏతమునకు కట్టిన బాన క్రిందికి పోవుచు పైకి లేచుచు నుండును.

అట్లే--పురుషులు వృద్ధిక్ష్యయములయందు దదనుగుణముగ ప్రవర్తింతురు.

ఘటీయంత్రన్యాయమును జూడుము.

ఆరోహావరోహణన్యాయము

ఎక్కినవరుసనే మఱల క్రిందికి దిగవలెను. సోపానారోహణ, సోపానావరోహణ, సౌధసోపానన్యాయములను జూడుము.

ఆశామొదకతృప్తన్యాయము

ఆశ అనే లడ్డూలతో తృత్తిపొందినవానివలె. ఆశామోదకయుతులకు, ఉపార్జితమోదకవంతులకు గల భేదము తడ్డ్వారా కలిగిన తృప్రియందును గలదు. "ఆశామోదకతృప్తాయే యేచోపార్జితమోదకా: రసవీర్యవిపాకారి తుల్యం తేషాం ప్రసజ్యూతే." ఆశాఓదకోపర్జితమోదకయో రస్త్యేవ స్వప్నే పికియ ద్వైలక్షణ్యమ్".

"శా. ఆశామోదకభక్షణంబు;నకు న న్నాకొల్సి తీభంగి".

కాకాని మల్లీశ్వరమాఅహాత్మ్యము (తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రిగారు)