పుట:SamskrutaNayamulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
199

సంస్కృతన్యాయములు

అర్ధకుక్కుటీన్యాయము

కోడిని కోసి సత్గభాగమును తినుటకును, తక్కినసగమును గ్రుడ్లు పెట్టించుట కుపయోగించుకొనవచ్చు నని తలచి నట్లు.

అర్ధలొకికన్యాయము

అలౌకికములైన వేదాదులకు లౌకికగ్రంధసంచయము వలననే అర్ధము గ్రహింపవలసియుండును.

అవిరావికన్యాయము

అవి అనగా గొఱ్ఱె; అవిక మనగా గొఱ్ఱెసంబంధమైనదని అర్ధము. (ఒకటి విగ్రహవాచకము; రండవది తదుత్పత్తివాచకము.)

"తత్ర ద్వయో: శబ్ధయో; సమానర్ధయో రేకేనవిగ్రహో పరస్మా దుత్పత్తి ర్భవిష్యత్యవిరావికన్యాయేవ తద్యధా--అవే ర్మాంస మితి విగృహ్య అనికశభ్ధాదుత్పత్తి ర్భవతి అచ్వికమితి"

అశోకవనికాన్యాయము

లంకలో సీతను రహస్యముగా నుంఛుట కనేకస్థలములున్నను రావణు డామెను అశోకవనములో నుంచుండని రాక్షసుల కానతిచ్చెను.

ఒకపనిని సాధించుట కనేకమార్గము లున్నను ఒకపద్ధతిని నిర్ణయించి వచించునపు డీన్యూయముపయుక్తము.