పుట:SamskrutaNayamulu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
197

సంస్కృతన్యాయములు

అట్లే---ఉత్తరాంశమువలన బూర్వంశమునకు బాధ కలుగు సందర్భమున నీన్యాయము ప్రవర్తించును.

"అనవాదై రుత్సర్గా బాధ్యన్తే" అను పరిభాషనుంది యీన్యాయ ముత్పన్నమైనది. వ్యాకరణశాస్త్రమున నీన్యాయమెక్కువగ నుపయోగింపబడును.

అపసారితాగ్నిభూతలన్యాయము

నిప్పు తీసివైచినను మొట్టమొదట ఆనిప్పు ఉంఛబడిన స్థలమున ఆనిప్పుచే కలిగిన వేడిమాత్రము పోదు. చంపకపట, రామఠకరండ న్యాయములను జూడుము.

ఆబ్ధిఫేనాదినాయము

సముద్రములోని నెటిబుడగలు, నురుగు మున్నగునవి క్షణములో పుట్తిఒ క్షణములో నశించుచుందును. ఉదా:--సంసారసముద్రములో జీవులు.

అబ్భక్షన్యాయము

నీళ్ళు త్రాగి జెవించునట్లు. వాయుభక్షణన్యాయమును జూడుము.

అభ్యుపదమసిధాంతన్యాయము

అధికరణసిద్ధాంతన్యాయమున నీన్యాయముయొ9క్క స్వరూపము వివరింపబడినది.

అయాచితమండనన్యాయము

ఒకవస్తువు అయాచితముగ లభించి తుద కది అలంకార ముగగూడ ఉపయోగించినట్లు.