పుట:SamskrutaNayamulu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
196

సంస్కృతన్యాయములు

అవచ్చేదన్యాయము

"ఏకకర్తృకో పచ్చేద:" పలువురు కలసి ఏమముఖమున నొకపనిచేయునపుడు వారిలోనివాడే యొక డాపనికి భంగము కలిగించుటకు అపచ్చేదము అనిపేరు.

ఉరా:--జ్యోతిష్టోమసవన మందొకానొక సమయమున ఋత్విక్కు లందఱు ఒకరిగోచి యొకరు పట్టుకొని చీమల బారువలె నడువవలయును. అట్టితఱి వారిలోనివాడే యొకడు-ప్రమాదవశముననే కానిండు-అగ్రేసరుని గోచి విడచిపెట్టిన (కచ్చవొమోచన మొనరించిన) తత్కృత్యమంతయు భగ్నమగును. కావున--

పూర్వవస్తువువలన పరవస్రువునకు భంగము వాటిలునపుడీన్యాయము ప్రవర్తించును.

అవవాదన్యాయము

పూర్వోదహృతవిషమునకు బాధకముగా నడువబడు నుత్తరవాక్యమునకు అపవాదము అనిపేరు.

ఉదా:-- కర్మప్రవృత్తులును భగవంతుని పొందగలదు. కామనయా కర్మప్రవృత్తులుమాత్ర మట్లు పొందనేఱరు. ఇందు సర్వసామాన్యముగ భగవత్ప్రాప్తిని వచించు మొదటివాక్యూము (సామాన్య శాస్త్రము) నకు బాధకముగ కొంతవ్యవస్థ అనగా కామరహితముగ కర్మల యందు ప్రవర్తించువారలు అనికల్పించుచు ప్రవర్తించు రెండవాక్యము అపవాద (శాస్త్ర)ము అని నడువబడుచున్నది.