పుట:SamskrutaNayamulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
194

సంస్కృతన్యాయములు

ఎట్లన---నీచాచారపరుడు నీచయోనులను బొందురు; తదితరుడు అనగా నీచాచారపరుడు కానివాడు నీచయోనులను పొందడు అన్నట్లు. ఇందు రెండవదివ్యతిరేకవాక్యము. రెండువాక్యముల తాత్పర్యము న్మొక్కటియే. (మొదటిదానికి వ్యతిరేకము రెండవరి; రెండవదానికి వ్యతిరేకము మొదటిది.)

అధికారన్యాయము

ఒకకృత్యమునకుగల అధికారమువలె.

ఏదేనికర్మయందు ప్రవర్తింప దాని కనువవు నధికారమత్యవసరము. అట్లధికార ముండియు నాకృత్యమొక వాంచతో నారంభింప్పబడును. "దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత" "జ్యోతిష్టోమేన స్వర్గకామోయజేత" అనినపుడు జాతపుత్రత్వార్యధికార సంపన్నుడయ్యుయజమానుడు స్వర్గకామనయా జ్యోతిష్టోమ, దర్శపూర్ణమాసారులయందు ప్రవర్తించునట్లు.

అద్యారోపాపవాదన్యాయము

అన్యధర్మముల నొకదానియం డారోపించి అదియే అది అని బోధించి మఱల కాదనుచు తద్ద్వరా అభిమతవస్తువును తెలుపునట్లు.

అరుంధతీప్రదర్శన న్యాయము జూడుము.

అనఫస్థాన్యాయము

ఉపపాద్యోపపాదకములకు సంబంధము లేనట్లు.