పుట:SamskrutaNayamulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
193

సంస్కృతన్యాయములు

అదిత్సోర్వణిజ: ప్రతిదినం పత్రలిఖిత శ్వంతనదినభలునన్యాయము ఈయ నిచ్చలేని వర్తకుడు రేపురా మాపురా అని ప్రతి దినము చెప్పునట్లు.

".......ఏవం తర్హి ముద్గరాదిసన్నిధానే పి ఏషఏవతస్య స్వభావ ఇతి పునర ప్యనేన తావస్తమేవ కాలం స్థాతవ్యమితి వైవం నివశ్వేదితి సోయ మదిత్సో ర్వణిజ: ప్రతిదినం పత్రలిఖితశ్వస్తనదినభణనన్యాయము."

అధికరణసిధ్దాంతన్యాయము

ఒకసిద్ధంతమునందు మఱొక డంతర్భూతమైయుడునట్లు. ఒకవిషయము నొకవిధముగా సిద్ధాంతీకరించుకొని దానిపై మఱల నింకొకరకమున నూహాపోహలు సేయుట అని న్యాయాశయము.

సిద్ధాంతము లాలుగు విధములు---(1) సర్వతంత్రసిద్ధాంతము. (2) ప్రతితంత్రసిద్ధాంతము. (3) అఢికరణసిద్ధాంటము (4) అభ్యుపగమసిద్ధాంతము.

1. సర్వసామాన్యముగ వర్తించునది సర్వతంత్రసిద్ధాంతము.

2. కొదఱచేమాత్ర ముపయేగింపబడునది ప్రతితంత్ర సిద్ధాంతము

3. ఊహాఓహలతోనుండునది అధికరణసిద్ధాంతము

4. వ్యతిరేకసిద్ధాంత మభ్యుపగమసిద్ధాంతము.

వ్యతిరేకమన-- ఒకవాక్యమును చెప్పి తద్వ్యతిరేకవ్యాకముచే మొదటివాక్యమందలిసిద్ధాంతమునే నడుపుట.