పుట:SamskrutaNayamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

సంస్కృతన్యాయములు

అగ్నివమ్రిన్యాయము
  • నిప్పునకు చెదలు పట్టునా?
అగ్నివహ్నిన్యాయము
  • అగ్నిని అగ్ని తగులఁబెట్టఁగలదా ?
అచలచలన్యాయము
  • నడచుచున్న యోడమొదలగువానిపై నెక్కి పోవునపుడు కదలక నిలచియున్న తీరము వృక్షములు మున్నగునవి నడచుచున్నట్లును, నడచుచున్న యోడ నిలిచినట్లును కన్పించును.
అజగరన్యాయము
  • కొండచిలువ నిద్రబోవుచున్నట్లే పడియుండి తన్ను సమీపించిన జంతువును ఆకస్మికముగఁ బట్టి మ్రింగివేయును.
అజాకృపాణీయన్యాయము
  • కత్తి లేనికారణమున దన్ను జంపఁజాలక యుపాయ మరయుచున్న యొకపురుషునిపై మేక యొకటి మదమున గాలు ద్రవ్వెను. అట్లు త్రవ్వినమట్టిలో నొకకృపాణము బయటపడెను. వాఁ డది గైకొని దానిం దెగటార్చెను.
అజాగళస్తనన్యాయము
  • మేక మెడక్రింది చన్నులు నిష్ప్రయోజనములు. కళా. 1-7
అణుకులాచలన్యాయము
  • అణువునకు పర్వతమునకుఁ గల తారతమ్యము.