పుట:SamskrutaNayamulu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
192

సంస్కృతన్యాయములు

అతిదేశన్యాయము

ఓకస్థానమున నున్నపుడు వస్తువున కాస్థానధర్మములనారోపించునట్లు.

వాతావరణమును బట్టి భూమికి శైత్యౌష్ఠాదులు సంభవించునట్లు.

అతీతమహెషీ స్నేహన్యాయము

గార్హస్థ్యములో నున్నపు డొక డొకబఱ్ఱెను మహా ప్రేమతో పెంచెను. కాలంతరమున నాతడు సన్యాసాశ్రమముని స్వీకరించి తత్త్వోపదేశమును పొందెను. అయినను వెనుకటిబుద్ది మాఱక వాని కెపుడును ఆబఱ్ఱెయే మనసున స్పురించుచుండెడిదట.

అవస్థాభేదము సంభవించినను పూర్వావస్థయందలి వాసనలు వదలిపోనితావున నీన్యాయ ముపయుక్తము.

"కృతే పి కేశసంస్కారే భారాత్వం నైవ ముంచతి" అన్నట్లు.

ఆదగ్దదహనన్యాయము

అగ్ని కాలక పచ్చిగా నున్నవానినే కాల్చునుగాని కాలిపోయినదానిని కాల్చదు.

సంసారబంధము రాగాసక్తునికేగాని రాగరహితునకు తగుల్కొనదు.