పుట:SamskrutaNayamulu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
191

సంస్కృతన్యాయములు

ఆగ్న్యానయనన్యాయము

"నిప్పు తీసుకురమ్ము" అనిన ఏదేనిపాత్రలో వేసుకొని అని వేఱె చెప్పవలెనా?

జలానయనన్యాయమును జూడుము.

అజాతపుత్రనామోత్కీర్తన్యాయము

పుట్టనికొడుకుగుణములను పొగడుకొన్నట్లు.

ఆలు లేదు; చూలు లేదు; కొడుకుపేరు సోమలింగము అన్నట్లు.

అజాయుద్ధన్యాయము

మేకలపోట్లాట మొదట ఆడంబరముగ నుండి తుదిని క్రియ శూన్యమవును.

"అజాయుద్ధే ౠషిశ్రాద్ధే ప్రభాతే మేఘడంబరేదమ్పత్యో; కలహేచైన బహ్వారమ్బో లఘుక్రియా."

ఆరంభశూరత్వము నీన్యాయము సూచించును.

మేషయుద్ధన్యాయ మనియు దీనికి బేరుకలదు.

ఆజ్ఘత్ న్యాయము

అచులు ప్రాణములు; హల్లులు ప్రాణులు. అచుతో సంయోగ మున్నంతదనుక హల్లులకు స్ఫుటోచ్చారణముండును; లేనిచో హల్లున కుచ్చారణమే యుండదు.

అట్లే---ప్రాణ మున్నంతవఱకే దేహవ్యాపారము.