పుట:SamskrutaNayamulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

అంకోలబీజన్యాయము

ఊడుగచెట్టుగింజలు విడిగా మొలకెత్తక ఉరిమినతోడనే చెట్టు కంటుకొనును.

"కాంధియ స్వ్యయి రచితా న పరమ రోహన్తి యధా కరమ్బబీజాని, జ్ఞానాత్మ న్యగుణమయే గుణగణతో స్య ద్వన్దజాలాని." భాగవ. స్కం.6, అ. 16. శ్లో.89

విషయమేకామేనాపికృతాత్వత్సేవా మోక్షఫలైవేత్యాహ-కామధియ: విషయకామనా అపి హేపరమ త్వయితచితా:, కృతాశ్చే న్నరోహన్తి దేహాస్తరోత్సత్తయే నభవన్తి కరమ్బబీజాని భర్జితబీజాని యధా!@ యతో స్య జీవస్య గుణగణాదేవ ద్వన్ధసమూహా భవన్తి! అత: కామేనాపి నిర్గుణాదేవ ద్వస్ద్వసమూహా భవన్తి! అత: కామేవాసి నిర్గుణస్య తన భజనా చ్చనై ర్నైర్గుణ్యం భవరీత్యర్ధ:||

అంగారన్యాయము

బొగ్గును ముట్టుకొన్నట్లు.

కాలుచు ఉన్న బొగ్గును ముట్టుకొనిన చేయి కాలును. చల్లారినబొగ్గును మొట్టుకొనిన చేతికి మసి అంటుకొనును. ఏవిధముగానైనను బొగ్గును ముట్టుకొనుట అసంగతమే.

ఉదా:--దుష్టసాంగత్యము.