పుట:SamskrutaNayamulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
184

సంస్కృతన్యాయములు

మంచిగంధపుచెక్కను అరుగదీసినకొలది సువాసన వచ్చును; బంగారమును కాల్చినకొలది వన్నె హెచ్చును.

"స్వవిషమూర్చితో భుజంగ ఆత్మావమేవ దశతి" న్యాయము

విషాతిరేకిఅమున నొడలు తెలియని పాము తననే కఱచి కొనునట్లు.

స్వవచనమునకు కుయుక్తులచే తానే నిరర్ధికత్వమును దెచ్చిపెట్ కొనునపు డీన్యాయముమయోగొంప బడును. ఏడ్చి ఏడ్చి తనతల తానే గోడకు కొట్టుకొన్నట్టు.

స్వామిభృత్యన్యాయము

యజమానునకును భృత్యునకును గల సంబంధముమాదిరి. అన్నివిధముల సమానులయినవారలయందు పరస్పరోపకార్యోపకారకభావము ఘటింపనేఱదు. ఎందువలననన--వారొకరి రోక రెందును తీసిపోరు.

రాజభృత్యసంబంధమున నట్లుగాదు. తనయజమాని యవుట రాజుపై భృత్యునకు భక్తిశ్రద్ధలపారముగను, నమ్మినబంటుకావున తగినభృత్యునిపై రాజునకు వాత్సల్యమును గలిగి వారు అప్రస్పరోపకార్యోపకారకభవమున నొప్పుదురు.

"తతశ్చ జీవేశ్వరయోర ప్యుపకారకభావాభ్యుపగమాత్కిం స్వామిభృత్యసంబంధ అహోస్విదగ్నివిస్ఫులింగనదిత్యస్యాం విచికిత్సాయా మనియమో వా ప్రాప్నోతి"

న్వేదజనిమిత్తేన శాతకత్యాగన్యాయము

చేమటపోయు నను భయమున వస్త్రము మానినట్లు