పుట:SamskrutaNayamulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
183

సంస్కృతన్యాయములు

స్వప్నవ్యాఘ్రన్యాయము

కలలో కనుపడిన పెద్దపులి భయపెట్టి గల్లంతుచేసినను మెలకువ కలిగినతోడనే కలతోబాటు కనుపడక నశించును.

అవిద్యావరణ మనివార్యమై దృఢముగ నున్నంతదనుక సంసారబంధము పెక్కు బెడందల బడద్రోచినను జ్ఞానము కలిగినవెంటనే అవిద్యావరణముతోబాటు సంసార బంధముసయితము దూరమవును.

స్వప్రకాశాశ్రయన్యాయము

వెలురుగునకును, తదాశ్రయమునకును భేదము లేనట్లు. సూర్యునిప్రకాశమునకును, సూర్యునకును భేదమిసుమంతయులేదు. కాని ప్రకాశముచే మనము సూర్యుని గుర్తించుచున్నాము. సూర్యజ్ఞానమునకు ప్రకాశము సాధన మవుచున్నది.

సగుణ, నిర్గుణ బ్రహ్మలకు భేదము కాన్పింపదు. కాని, సగుణముద్వారా నిర్గుణమును కనుకొనుట సుకరము. కావున నిర్గుణపరబ్రహ్మము నెఱిగికొనుటకు సగుణ నిషేవణ మొక సాధన మవుచున్నది.

స్వభావ్సిద్ధన్యాయము

స్వభావముగ గలిగిన గుణములను వస్తువు లెన్నడును విడువనేఱవు.