పుట:SamskrutaNayamulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
182

సంస్కృతన్యాయములు

అట్లే--ఉపాస్థితుడై ఆత్మ ఆయాఉపాధిగుణభావమున భావింపబడును. ఉపాధి నశించిన మఱల స్వస్వరూపమున వెలుగొందును.

"నానావిధవస్తూనాంవర్ణాన్ ధత్తేయధార్ మల: స్ఫటిక:, తద్వదుపాధే ర్గుణభావితస్య భావం విభు ర్ధత్తే. విగతోపాధి: స్ఫటిక; స్వప్రభయా భాతి నిర్మలోయద్వత్, చిద్దీప: స్వప్రభయా తధా విభాతిఎహ నిరుపాధి:."

స్రోతోనిమ్నన్యాయము

నీరు పల్లమునకే పోవును.

"నీరుపల్లమెఱుగు నిజము దేవు డెఱుగు"

స్వకుచమర్ధనన్యాయము

తనకుచములు తానే పిసికికొనినట్లు.

తిమురున నుబిసిపడు తనకుచములను తానే పిసికికొనియువతి యెట్టిసుఖ మనుభవించును/

తనను తానే పొగడికొన్నట్లు.


దీనికి స్వకరకుచన్యాయమనియు బేరు కలదు.

స్వదీపచుంబనన్యాయము

మనదీపమేకదా అని ముద్దు పెట్టుకొనిన మూతిమీసములు తెగకాలినట్లు.

"మునుకొని యింటిదీప మని ముద్దిడా మీసలు గాల కుండునే?"