పుట:SamskrutaNayamulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
180

సంస్కృతన్యాయములు

స్థావరజంగమవిషన్యాయము

విషధర్మము ప్రాణహానిచేయుట. ఆవిషమునకును విషము నాశకరమే అవును. అందు విషము రెండువిధములు-- స్థావరము జంగమము అని, అందేది నాశకము? ఏది నాశ్యము? అనునది ప్రశ్న.

అట్టియెడ--- పూర్వాత్పూర్వబలీల్యస్త్వ న్యాయముచే పూర్వప్రయుక్తమైన స్థావరవిషము--- అనగా వత్సనాభము, తెల్లేఎశ్వరము మున్నగునవి-- పరప్రయుక్తమైన జంగమవిషమును సర్పాది సంబంధమైనదానిని బాధించును. అనగా వత్సనాభాది మూలికాప్రయోగముచే పామువిషముకూడ ఉపశమించుట మనము చూచు విషయమే.

అట్లు స్థావరవిషము జంగమవిషమును రూపుమాపి తుదకు తానుకూడ విషసంపర్కముచే నశించును. కావున పరస్పరబాధ్యబాధకవివషక్షయందును, వస్త్గ్వంతరము నుపశమింపజేసి తానుకూడ నుపశమించు విషయమనును ఈన్యాయము ప్రవర్తించును.

"సామాన్యేన పరస్పరబాధ్యబాధకవివక్షాయాం సుందోపసుందన్యాయవిషయే స్యప్రవృత్తి; పూర్వం నివర్త్యాన్యస్యస్వయమెవ నివృత్తౌ వివక్షితాయాం దగ్దేంధనహ్ని న్యాయవిషయే స్యావతరణమ్||"