పుట:SamskrutaNayamulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
173

సంస్కృతన్యాయములు

అట్లే---యొకవిషయమున దనకు సంబంధించి తనకవసర మవునంతదనుక గ్రహించి మిగిలినదానిని వదలివేయుటలో నీన్యాయము ప్రవర్తించును.

సూచీకటాహన్యాయము

ఒకడొక కమ్మరివానికి సూదియొకటియు, కాగొకటేయు తయారుచేసి యిమ్మని చెప్పను. వాడు ముందు సూది తయారుచేసి యిచ్చెను కాగేది అనగా రెంటిలో నొకటి ముట్టినదిగదా, యిక కాగుప్రయత్నము చేసెదనని చెప్పెను.

లోకములో రెందుపనులు - ఒకటి తేలికగ కొలదికాలములో జేయవీలవునదియు; మఱొకటి కష్టసాధ్యము, బహుకాలము పట్టునదియు-- వచ్చినపుడు మొట్టమొదటా సులభమైనదానిని మొదలిడి పూర్తిగావించి ఆపిదప రెండవదాని కుపక్రమింతురు.

పరీక్షలో బాలురు ఎక్కువ ఆలోచింప నవసరములేక తేలికగ వ్రాయగల ప్రశ్నలకు ముందు సమాధానము వ్రాసి, ఆపిదిప ఆలోచింపవలసి ఎక్కువవేళ తీసుకొను ప్రశ్నలకు సమాధానములు వ్రాయునట్లు.

అట్లే--వైదికసంప్రదాయమునగూడ--

"అనుభవొపి ద్వివిధ:! ప్రమా ప్రమాచ అప్రమాసిసంశయో విపర్యయశ్చ! ప్రమాచ ప్రత్యక్షమనుమతిశ్చ:"

"ప్రమానిరూప్యత్వా త్పరస్తా ద్విభకామ ప్యప్రమాంసూచీకటాన్యాయేన స్రాగ్విభజతేజ ప్రమాపీతి."