పుట:SamskrutaNayamulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

సంస్కృతన్యాయములు

అంధకూపన్యాయము
  • కొందఱు గ్రుడ్డివాండ్రు ఒకరివెనుక నొకరు బోవుచు, మొదటివాఁడు నూతిలోఁ బడఁ దక్కినవా రందఱు వాని త్రోవనే యనుసరించి నూతిలోఁ బడిరి.
అంధగజన్యాయము
  • నలుగురు గ్రుడ్డివాండ్రు ఏనుఁ గెట్లుండునో పరీక్షింపఁగోరి యొక యేనుఁగువద్దకుఁ బోయి నలుగురు నాలు గవయవములను తడవి చూచి పరీక్షించిరి. కాలు తడవినవాఁడు యేనుఁగు రోలువలె నుండుననియు, తోఁక తడవినవాఁడు చీపురువలె నుండుననియు, చెవులు తడవినవాఁడు చేటవలె నుండుననియు, తొండము తడవినవాడు రోకలివలె నుండుననియు వారు వాదింపఁజొచ్చిరి.
అంధగోక్షేత్రన్యాయము
  • గ్రుడ్డియెద్దు చేనిలోఁబడి తన నోటికందినదెల్ల తినును.
అంధగోలాంగూలన్యాయము
  • గ్రుడ్డివాఁడు ఆవుతోఁక బట్టుకొని నడచినట్లు.
అంధదర్పణన్యాయము
  • గ్రుడ్డివాని కద్దము చూపినట్లు.
అంధదీపికాన్యాయము
  • గ్రుడ్డివానికి దీప మున్నను లేకున్నను నొక్కటే.