పుట:SamskrutaNayamulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
172

సంస్కృతన్యాయములు

"సూక్తవాకేన ప్రస్తరం ప్రహరతి" అనగా-- సూక్తనాకమును బఠించుచు ప్రస్తరప్రహరణమును చేయవలయును అని శ్రుతి విధించుచున్నది. ప్రస్తరప్రహరణమన దర్భలతో హోమమము చేయుట.

ఇంఫు విధివాక్యమున "సూక్తనాకేన--" అని యుండుటచే ప్రస్తరప్రహరణావసరమున సూక్తము నెంతవఱకు అనగా పూర్తిసూక్తమునా లేక దానిలో కొంతభాగమునా చదువవలసినది అని సంశయము. వేదమందెచటను ఈ విషయమై నిర్ధారణలేదు. అట్లు వేదమెపుడును నిర్ధారణ చేయదుకూడను.

అంతియగాక-- ప్రస్తరప్రహరణ మనేక దేవతలనుగూర్చి యాచరింపబడును. ఆయాసూక్తములలో నాయాదెవతలను గుఱించి హోమాదిక మొర్చునపు డేయేసూక్తము నెంతదనుక బఠింపవలసినదియు వేదమున వచింపబడియుండలేదు.

అట్టియెడ హోమము నెట్లు చేయవలెనను మీమాంసరాగా-- యజమాని ఏ దేవతను గుఱించి తాను హోమమౌ చేయచున్నాడో ఆదేవతకు సంబంధించిన సూక్తభాగమును గ్రహించి కర్మానుకూలముగ దనకవసర మగునంతదనుక ఆసూక్తమును జురుపుచు హోమము చేయవలెను. అది యజమాని యధీనమ్ము అని పెద్దలచే నిర్ణయింపబడియున్నది.