పుట:SamskrutaNayamulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
168

సంస్కృతన్యాయములు

ఆచెట్టు ఉన్నఆట్టణముపేరు భవిష్యన్నగరము. ఆముగ్గురు పిల్లలు ఆభవిష్యన్నగరములో ఇంకను వేటాడుచునే ఉన్నారు." పిల్లవాడు కధ నిజమే అనుకొని ఊకొట్టుచూ వినుచున్నాడు.

అట్లే---సంసారమున బడి స్త్రీపురుషులు మాయావృతులై విహరించుచు అనేకకష్టముల బారిబడి ఆశాపాశములు చుట్ట పాపాచరణమునకుంగడంగి మృతులై కర్మఫలానుకూలముగ మఱొకచో జనించి మరల నశించుచు సంసారము నిజమే అనునమ్మకమున పడరాని పాట్లుపడుచుందురు.

సుభగాభిక్షున్యాయము

చక్కనిచుక్కయైన యువతి యుండవలెను, సన్యాసియుగావలెను అన్నట్లు.

"ఏకత్ర విరుద్దానేకధర్మసమావేశాసంభవవివక్షాయాంతు సుభగాభిక్షున్యాయ: ప్రవర్తతే."

పరస్పర విరుద్దములైన అనేకధర్మము లొకచో సమావేశమగుట సంభవింప నేఱదను సందమున సుభగాభిక్షున్యాయము ప్రవర్తించును.

ఎట్లన---"యధా సుభరాత్వం, భిక్షుత్వం; స్త్రీత్వం పుంస్త్వంచ తిధావిధపదద్వయసామాన్యాధికరణ్యా త్ప్రతీయమానమపి విరుద్దత్వా దేకస్మి న్యుగపన్న సంభవతి తధా---"