పుట:SamskrutaNayamulu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
164

సంస్కృతన్యాయములు

సింహస్వైక పద న్యాయమున మొట్టమొదటియడుగువైచెను.

ఆరంభశూరత్వమును గూడ నీన్యాయము సూచించును.

సింహావలోకనన్యాయము

సింహము ఒకమృగమును చంపి ముందుకు సాగిపోవుచు, కొంతదూర మరిగినతరువాత తిరిగి వెనుదిరిగి చూచును. అపు డింకొకమృగము కనబడిన పరుగుపరుగున వచ్చి దానినిగూడ గడతేర్చును. ఇట్లే కనబడినదని నెల్ల జంపివేయును.

సిద్దాంతి తనవాదమును సమర్ధించుకొనుచు కొంతదూరము పోయి వెనుదిరిగి పూర్వపక్షివాదముపై పూర్వపక్షము చేయుచు యుక్తితో వాని నోడించును.

సంహీక్షీరన్యాయము

సింహముపాలు బంగారుగిన్నెలో మాత్రమే విఱిగిపోక నిలుచును.

వ్రాఘ్రీక్షీతన్యాయమును జూడుము.

సికతాకూపన్యాయము

ఇసుకదిబ్బలో తీసిన వావివలె, ఇసుకనేలలొ వావిగుంట తీసిన ఒడ్డునిలువక విరిగి పడిపోవును.