పుట:SamskrutaNayamulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
163

సంస్కృతన్యాయములు

నీవు మావలెనే సింహమవు అనిబోధించెను. అపుడది మేకననుభ్రాంతి వదలి సింహమయ్యెను.

అజ్ఞానావృతమై యున్నంతదనుక ఆత్మ తాను దేహిని అని తెలుచుచుండును. గురూపదేశానంతరము ఆఅజ్ఞానము నశించి స్వస్వరూపజ్ఞానము నొంది పరమాత్మయైపోవును.

రాజపుత్రవ్యధాన్యాయమును జూడుము.

సింహస్తైకపదన్యాయము

సింహముయొక్క మొదటయడుగునవడువున.

తనశత్రువుపైకి పోవునపుడుగాని, మఱొకపుడుగాని సింహము మొట్టమటేయడుగు మహాఠీవితో, మహా సాహసముతో వైచును. తరువాత నేమైన గానిండు. అట్లే--మొట్టమొదటి ప్రయత్న మతిసాహ శౌర్యధైత్యాలతో నొప్పునప్పు డీన్యాయ ముపయోగింపబడును.

ఎట్లన---

"విచార్యావిచార్య వా, కృతప్రయాణో యం మహా నరేంద్ర శ్చానితం! సింహస్యైకపదం యధేతి న్యాయాచ్చలిత ఏవ రాజతే"

విచారించియో, విచారించకయో మంత్రిముఖ్యులచే బ్రేరేపింపబడి యుద్ధసన్నద్ధుడై బయలుదేరిన రాజు