పుట:SamskrutaNayamulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
159

సంస్కృతన్యాయములు

సవిశేషణేహిన్యాయము

"సవి శేషణేహి విధినిషేధౌ విశేష్యే బాధేసతి విశేషణముపసంక్రామత:" అను వేదాంతపరిభాషనుండి ఈ న్యాయము పుట్టినది.

సవిశేషణమై యున్న విశేష్యము బాధింపబడినపుడు విధినిషేధములు విశేషణమునకు సంక్రమించును.

(అప్పుతీసికొనినవాడు తిరిగి తీర్చక పరారైనపుడు వాని కూతగ వచ్చి నిలిచిన జామీయదారుపై జరగవలసిన అన్ని విధములకర్మకాండ విఱుచుకొని పడినట్లు)

'సహైవ దశాభి: పుత్రై ర్భారం వహతి గర్ధభీ' న్యాయము

పదిపిల్లలతో గలిసి పోవుచున్నను భారమంతయు తల్లి గాడిద ఒకటే మోయుచుండును.

అట్లే---"సహకారిత్వం కర్మణాం న విధ్యాయా:...... సత్సు కర్మము విద్త్యవ స్వకార్యే వ్యాప్రియతే యధా దశభ్ణి: పుత్రై: ....."

విధ్యకు కర్మలు సహకారులు కాబోవు..... అనేకకర్మములున్నను విద్యయే తనకార్యమున ప్రవర్తించును......ఇంటిలో పదిమంది తినేవారున్నను ఇంటియజమాని యొకడే అయింటిపోషణభారమంతయు మోయునట్లు.

సాకమేధీన్యాయము

నాలుగేసిమాసములు కొకసారిగ సంవత్సరమునకు మూడు మాఱులు---వసంతర్తువున, వర్షర్తువున, హేమతర్తు