పుట:SamskrutaNayamulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
158

సంస్కృతన్యాయములు

ఎట్లన:-- కొందఱు సూర్యోదయమునకు బూర్వమే అగ్ని హూత్రము వేల్తురు; కొందఱు సూర్యోదయానంతరము వేల్తురు. కాని, ఇరువురుచేయునదియు నొకటే, ఇరువురకు నది ముఖ్యమే.

ఉదా:-- సూర్యచంద్రులకు భూమి అడ్డముగా వచ్చుటచే గ్రహణములు వచ్చును అని పాశ్చ్యాత్యులందురు. మనవారు సూర్యచంద్రులను రాహుకేతువులు మ్రింగివేయుట వలన గ్రహణములు వచ్చుచున్నవి అందురు. ఇరువురు చెప్పునదియు నొకటే. ఒకేకాలమునకు నిరువురు నిర్ణయించి వచింతురు. కాని, పద్ధతిమాత్రము భిన్నము.

సర్వాపేక్షన్యాయము.

సర్వసంఘాతముపై నాధారపడినట్లు. శబ్దసమూహమునకు జెప్పబడినయర్ధము అందవయములుగ నున్న ప్రత్యేకపదముల కన్యయించదు. పలువురిచే గావలసిన పనియొకడు వారిలోనివాడే యొకడు చేయనేఱడుగదా!

సలిలాదిత్యన్యాయము

జలసూర్యునివలె.

వాస్తవమున సూర్యు డొకడే అయ్యు నీటిలో అన్ని తరంగములయందును ప్రతిఫలించి అంతమందిసూర్యులుగ తోచును.

ఈశ్వరు డోకడే అయ్యు అనేకోపాధుల నాశ్రయించి అనేకరూపములుగ భాసించును.