పుట:SamskrutaNayamulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
157

సంస్కృతన్యాయములు

సముద్రవృష్టిన్యాయము

సముద్రములో వర్షము గురిసినట్లు. నిష్ప్రయోజనము.

ఊషరవృష్టి, అరణ్యరోదన, పిష్టవేషణ, వనచంద్రికా, శవ్యోజ్వర్తన, గర్ధభరోమగణన, శ్వపుచ్చోనామన, బధిరకర్ణజప, అంధకరదీపికా, అంధదర్పణాది న్యాయములు జూడుము.

సమూహాలంబనన్యాయము

సమూహాముపై నాధారపడినట్లు.

ఒకవాక్యమునగల ప్రతియొకశబ్ధమునకును అన్యయము కుదరనపుడు మొత్తముశబ్ధముల నన్నిటికిని గలిపి అన్వయము సరిపోవును.

సంఘములోనివారిలో బ్రతియొక్కడును సమర్ధుడు కాక పోయినను మొత్తముమీద నందఱును సమర్ధులే అవుదురు.

సర్వశాఖాప్రత్యయన్యాయ

"సర్వశాఖాప్రత్యయ మేక కర్మ" అని శాఖలవారును నమ్మునది ఒకకర్మయే

అనగా--భిన్నభిన్న వేదమార్గావలంబకు లెల్లఱు అగ్న్యు పాసనాపూర్వక మైనకర్మమే ముఖ్యముగా చూచుకొందురు. ఆచరించుపద్ధతి భిన్నమగుగాక అగ్ని హూత్రమునకు మాత్రము భంగము రానీయరు.