పుట:SamskrutaNayamulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
156

సంస్కృతన్యాయములు

కావున ఈనియమము కొన్నితావులమాత్రమే ప్రవర్తించునుగాని సార్వజీవికము కాదని జయంతభట్టు మున్నగు వారి అభిప్రాయము.

సన్యాసియోషాన్యాయము

సన్యాసి కావలెను; మంచి అందగత్తెయు చూడవలెను ఈరెండు ఒకేస్థితియందు కలియుటెట్లు?

పరస్పరవిరుద్ధధర్మము లొకచొ బేర్కొనంబడునెడ నీన్యాయము ప్రవర్తించును. సభగాభిక్షున్యాయము జూడుము.

సముద్రకిట్టన్యాయము

సముద్రములో మలము వైచిన తిరిగి ఒడ్డునకే వచ్చును గాని, సముద్రమున కేచెఱుపును గూర్చనేరదు. సత్పురుషుల కెగ్గు దలపెట్టిన నది చుట్టుప్రక్కలవారికి సంక్రమించునేగాని, వారికేలోటును గూర్చంజాలదు

సముద్రమధుబింబన్యాయము

సముద్రములో తేనెచుక్క వైచినను సముద్రజలము తీయబడునా?

సముద్రమధనసమయమున అమృతాదిఫలభోక్తలు దేవతలు; సంక్షోభము నొందినది సముద్రుడు.

లోకమంగళమునకై సత్పురుషు లెట్టి యిక్కట్టులకైన నొడిగట్టుదురు.