పుట:SamskrutaNayamulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
155

సంస్కృతన్యాయములు

లలో ముగియునవి; ఋత్విగాదులు సత్రవిశేషమును బట్టి కొందఱు నియమింపబడుదురు. అట్లు ఋత్విగాదులను నియమించుకొని సత్రమును ప్రారంభించిన నది ముగియక ముంపె నియమితులలో నొకరుడు కారణాంతరమున సత్రవాటిక విడిచిపోయిన లేక మరణించిన వానిస్థానే మఱియొకని నియమించుకొందురు. లేనిచో నాయాగము భ్రష్టమవును. అగతికమై యాగము భ్రష్టము కానున్నయపుడు గతి గల్పించి దానిని సంరక్షించుకొనుటయే ఆ నూతనపురుషనియోగమునకు ఫలము.

అట్టిపట్టుల నీ న్యాయము ముపయోగించును.

ఇంచుమించు రాత్రిసత్రన్యాయమున కియ్యది సరివచ్చును.

నదృశా త్పదృశోచ్చన: న్యాయము

ఎటువంటిదానివలన అటువంటిదే పుట్టును. అనులోమమున అనులోమంసృష్టియేగాని విలోమసృష్టి కానేఱదు. ఏవిత్తువలన ఆచెట్టు. కాని, అనులోమమున విలోమసృస్టియు కలుగుచున్నది. ఎట్లన--

"నచైన నియమో లోకే సదృశా త్సదృశోద్భవ:, వృశ్చికాదే; సముత్సాదోగోమయా దపి దృశ్యతే." తేళ్ళు మున్నగునవి తేళ్ళవలననేగాక పేడవలనగూడ పుట్టుచుండుటవలన 'సదృశా త్సదృశోద్భవ:' అను నియమము సర్వజీవసామాన్యముగ గన్పిచుటలేదు.