పుట:SamskrutaNayamulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
154

సంస్కృతన్యాయములు

మఱల దదావృత్తిపొంద బడదు అని అందువేమో, అట్ లుగాదు.

సకృద్గతిన్యాయము

"సకృద్గతౌ యద్బాధితం చిచ్చాధిత మేవ" అని వారిభాషను నాగొజీభట్టు న్యాయరూపమున క్లుప్తేకరించెను.

తుల్యబలములుగల రెండు శాస్త్రము లొకచో బ్రవర్తించునపుడు తొలుత నొకదానిచే బాధపడి ప్రవర్తింపకున్న శాస్త్రము బాధితమే కావున మూలదానికి ప్రవృతి యుండదు.

ఒకపనిని సాధింపగలవా రిరువురున్ను, వారిలో నొకనినాపనికై నియోగించి రండవానిని మానివేయుదుము గాని, వానిని గూడ ఆపనికై నియోగింపముగదా.

సుక్తున్యాయము

అన్నముమాని పేలపిండితినినట్లు

ముఖ్యమయినవానిని వదలి అప్రయోజనమైన తేలికపనికి బూనుకొనుట.

మత్తకాశినీ, శ్వానారోహన్యాయమువలె.

సచ్చిద్రఘటాంబున్యాయము

చిల్లికుండలో బోసిన నీరుతీరున.

సత్రన్యాయము

సత్రము అనగా యజ్ఞము, యజ్ఞము లనేకములు. కొన్ని కొలదిదినములలో ముగియునవి; మఱికొన్ని చాలదినము