పుట:SamskrutaNayamulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
153

సంస్కృతన్యాయములు

విచారవిషయత్వంచ నాజ్ఞాతస్య నాపి నిశ్చితస్య కింతు సందిగ్ధస్య సందిగ్ధం సప్రయోజజనం చ విచార మర్హతీని న్యాయాత్"

సవిమర్శముగ విచారించినకొలదిని భ్రమ దూరమవును. కాన కలయధార్ధభావము తెలియరాక సందిగ్ధావస్థయందు జిక్కియున్నయంశము నప్రయోజన మవునెడా, తప్పక విచారింప నర్హమవుచున్నది.

సంవారిభ్రమన్యాయము

మణిప్రభను చూచి మణియను భ్రాన్తితో వాస్తవమణిని వదలి మణిప్రభయొద్దకుం జేర్చుభ్రమ. మణిప్రభామణిప్రభామతిన్యాయమును జూడుము.

సకృత్కృతేకృత: శాస్త్రార్ధ: అను న్యాయము

ఒకమాఱొనరిమపబడిన శాస్త్రార్ధము నింకొకమాఱు చేయు టవసరము.

"నను సకృత్కృతే కృత: శాస్త్రాన్ధ ఇతి న్యాయే సశృదధ్యయనాదేవ నిత్యాధ్యయనవిధిసిద్ధే రావృత్తి ర్నలభ్యేతేతి చేన్న."

ఈవాక్యము వివరణప్రమేయసంగ్రహమ్మదలిది. సిద్ధాంతి పూర్వపక్షితో ననుచున్నాడు.

"సకృత్కృతేకృత: శాస్త్రార్ధ:" అనున్యాయముచే సకృదధ్యయనముచేతనే నిత్యాధ్యయనవిధి సిద్దించుచుండ