పుట:SamskrutaNayamulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
141

సంస్కృతన్యాయములు

శిరోవేష్టనేన నాసికాస్పర్శన్యాయము

"శిరోవేష్టవేన అంగుల్యా నాసికాప్రవేశవత్" నీముక్కుచూపు మనిన తల చుట్తి చేతితో ముక్కు చూపెనట్లు.

"తణుకు పోయి మాచవరం" వలె.

ద్రవిడప్రాణాయామన్యాయమును జూడుము.

శీతకిరణకరావలంబనన్యాయము

చంద్రకిరణములను పట్తుకొన బ్రయత్నించినట్లు. శక్తికి మించి, అసంభవములైన పనులలో ప్రవర్తించునపుడీ న్యాయము వర్తించును.

ఆకాశముష్టిహననము, పొగను మూటకట్టుటవలే.

శీతలాప్రస్తరన్యాయము

ఱాతిని శీతల (ఒకానొక దేవత) మున్నగువిగ్రహములుగా చెక్కి పూజింతురు. దానినే తూనిక ఱాళ్ళుగా వాడుదురు. అయ్యదియే చాకిబండగా నుపయోగపడును.

భావనవలన కోతి బ్రహ్మయు; బ్రహ్మకోతియు నవును.

శుండాసూచీన్యాయము

ఏనుగు తొండముతో త్రోవలో పడి యున్న సూదినికూడ తీయును.

శుకనలికాన్యాయము

కాకుదీక శుక నాక నలిక ప్రభృతు లస్త్ర విశేషములు. అని పైకి చూచుటకు వెఱపుగొలుపనివే యైనను యుద్ధములలో రధగజతురగాదులకు చాల హాని చేయును.