పుట:SamskrutaNayamulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
140

సంస్కృతన్యాయములు

దుగ్గ్రాహ్యమైన యంశము సంగ్రాహ్యమవుట కకుంధసి ప్రదర్శన న్యాయమటులు లోకప్రసిద్ధవ్యవస్థం గల్పించి నుడువుట.

"తరుశాఖాగ్రదృష్ట్ల్యైవ ప్రతీచి బ్రహ్మ దర్శ్యతే.

చంద్రుని జూపుమనిన యర్భకునకు ఆకొమ్మమీదుగ జూడుము, అదె చంద్రుడు ప్రకాశించుచున్నాడు--అని చూపునటులు కోశశూన్యమైనను కోశదృష్టితో బ్రహ్మ పదార్ధము ప్రత్యక్కునందు చూపింపబడుచున్నది.

నిరవయవమై తేజోరూపమైన పరబ్రహ్మవస్తువు నెఱింగి కొనుట సులభసాధ్యముకాదుగాన "అసా వారిత్యోబ్రహ్మ" ఈ కనబడు సూర్యుడే బ్రహ్మ అని కొంత వ్యవస్థ కల్పించినట్లు.

శాఖాచంద్రజ్ఞానానంతరము వాస్తవిక చంద్రస్వరూపము హృద్రూఢ మవునట్లు సూర్యాదివ్యవస్థలద్వారా అభ్యాసవశమున శుద్ధతత్త్వస్వరూపజ్ఞానము కలుగును.

శిభికర్పూరన్యాయము

కర్పూరపుముద్దకు నంటుకొనిన అగ్నిహోత్రము కొంత తడవు దానితోకూడ వెలిగి తుదకు రెండును కనుపడకుండపొవును.

దగ్ధేంధనవహ్నిన్యాయమును జూడుము.