పుట:SamskrutaNayamulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
139

సంస్కృతన్యాయములు

శవోద్వర్తనన్యాయము

శమును లేపుచు పొర్లించినట్లు. నిష్ప్రయోజన మని తాత్పర్యము. అరణ్యరోదనన్యాయమువలె.

శశవిషాణన్యాయము

చెవులపిల్లికి కొమ్ములవలె. మూషకవిషాణన్యాయము జూడుము.

కాకటికన్యాయము

"శిరశ్చేదేపి శతం న దదాతి వింశతిపంచకంతు ప్రయచ్చతి శాకటిక:"

భండి త్రోలువాదు "తలతీసినా, నూఱురూపాయలీయును; ఐదుఇరవైలు మాత్రమే ఇత్తును" అనునట్లు. మూర్ఖుడు తను పట్టిన పట్టేగాని ఒరులు చెప్పునది వినిపించుకొనడు.

శాఖచంక్రమణన్యాయము

ఒకకొమ్మనుండి మఱొకకొమ్మకు, దానినుండి, యింకొక కొమ్మకు, ప్రాకునట్లు.

శాఖాచంద్రన్యాయము

ఆకాశముపై నున్న చంద్రుని జూపుటకు చెట్టుకొమ్మ మీదుగ జూడుమని చెప్పునట్లు.