పుట:SamskrutaNayamulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
138

సంస్కృతన్యాయములు

శర్కరోన్మజ్జనీయన్యాయము

"శర్కరాచ క్షిప్తా పురుషస్యోస్మజ్జనం, తత్తుల్యం శర్కరోస్మజ్జనీయమ్:'

ఒకడు గట్టుననుండి కాలువలోనికి ఱాళ్ళు ఱువ్వెను; అంతకు మున్ను నీటిలో మునిగియున్నవాడొకడు తలపైకెత్తెను. ఆఱాయి తగిలి వానితల పగిలెను. శరపురు షీయన్యామమట్లు.

శలభన్యాయము

మిడుత దీపము నార్పి వేయునట్లు.

"ఉజ్వలగుణ మభ్యుదితం క్షుద్రో ద్రష్టుం న కధమపిక్షమతే, దగ్ద్వా తనుమపి శలభో దీప్రం దీపార్చిషం హారతి."

నీచుడు శ్రేష్ఠపురుషుని గొప్పతనమును జూచి యించుకంతయు నోర్వడు. తనఒడలి కాలిపోవుచున్నను, మిడుత దీప్రమైన దీపశిఖ నార్పివేయును.

శల్యకవానాబున్యాయము

చుంచెలుకవలె.

చుంచెలుక పురుండియున్నవాని పాదములను మెల్లగా నొప్పింపక కఱచి పాఱిపోవును.

ఏవిధమయిన కష్టమయిన కష్టమును తగులనీయక చతురతతో రాజు ప్రజలనుండి కప్పమును వసూలుచేసికొనవలెను.