పుట:SamskrutaNayamulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
137

సంస్కృతన్యాయములు

శతేపంచాశన్న్యాయము

నూటిలో ఏబది ఇమిడియున్నట్లు.

"వ్యాపకశతసంఖ్యాయాం యధా వ్యాప్యపంచాశత్సంఖ్యానివిష్టా ఏవం యత్ర వ్యాపకే వ్యాప్యస్య నివేశస్తత్రాస్య ప్రవృత్తి:"

వాచస్సత్యమ్

వ్యాపకమందు వ్యాప్యము తద్వ్యాపకఫలభాగి యయినపుడీన్యాయము ప్రవర్తించును.

అభిమన్యు డోకేదినమున ఎనిమిది అక్షౌహిణుల కౌరవ సేనం దునుమాడెను. అనిన చనిపోయినవారిలో ఒకటి రెండ్లు, మూడు, అక్షౌహిణులసేనగూడ నున్నదిగదా!

శరపురుషీన్యాయము

"శరశ్చక్షిప్త: ప్రాకారాచ్చ పురుష ఉత్ధిత:, స తేన హర: తత్తుల్యం శరపురుషీయమ్:'

ఒకడు గోడవైపునకు బాణము వదిలెను; దానివెనుక నుండి యొకడు తలవెళ్ళ బెట్టెను; ఆబాణము సరిగా వానికి తగిలి వాడు చచ్చెను.

కాకతాలీయన్యాయముగ జరిగిన పనులయం దీన్యాయప్రవృత్తి యవును.

అజాకృపాణీయ, ఖల్వాటబిల్వీయ, (బిల్వఖల్వాట) న్యాయములను జూడుము.