పుట:SamskrutaNayamulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
136

సంస్కృతన్యాయములు

నదీసముద్రన్యాయమును, నానావృక్షరసన్యాయమును, చోరాపహార్యన్యాయమును, పుంవిషయన్యాయమును జూడుము.

శతపత్రపత్ర శత భేధన న్యాయము

మాఱుదళములుగలదైనను పద్మము నొకమాఱు సూదితొగ్రుచ్చిన నూఱుదళములకు నొక్కమాఱుగ రంధ్రము పడును. ఆదళములని విడదీసి ప్రత్యేకముగ గ్రుచ్చినతో నూఱుమాఱులు గ్రుచ్చవలయును.

ఒకేపనివలన ఒక్కమాఱుగ ననేక ఫలితములు కలుగవు డీన్యాయ ముపయోగింతురు.

అంతియగాక---కమలముల నన్నిటిని విడివిడిగ చిల్లువడజేసి తుదకు జూచిన నవన్నియు నొకమాఱుగ నట్లు చిల్లు వేయబడినవా యేమి యని బ్రాంతి కలుగును.

ఒకపని క్రమముగగాక ఒకమాఱుగ నట్లు జరిగినదను భ్రాంతి కలుగునపుడును ఇయ్యది యుపయోగింపబడును ఎట్లన--

"శాంఖాచంద్రమసో స్తుల్యకాలోపలబ్ర్హి--" కొమ్మమీదుగ చంద్రుని చూడుము అని చెప్పిన ఒకడట్లే చూచెను. మొదటివాడు ముందుదేనిని జూచితి వని యడుగ నాతడు కొమ్మను చంద్రుని గూడ ఒకేపర్యాయము చూచితినని చెప్పెను. వాస్థవముగ నాతడు ముందుకొమ్మని జూచి తరువాత చంద్రుని గుఱుతించెను.