పుట:SamskrutaNayamulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
135

సంస్కృతన్యాయములు

నాగవేలాయా మాగంతవ్యం; పటహవేలాయా మాగంతవ్యం మున్నగు వాక్యములు నిట్టివిఉయే.

దీనికిశంఖవేలాన్యాయమనియు బేరు.

శకునిగ్రాహకగరిన్యాయము

పక్షిని పట్తుకొన బోవువాని నడకవలె.

"బధా శకునిగ్రాహకస్య శకునిం జిఘృక్షత శ్చద్మనాగతిర్భవతిశనై:పదన్యాసో దృష్టిప్రైణిధాన మశబ్డకరణంచ; కధ మనవబుద్ధ: శకుని ర్గృహ్యేత...."

పక్షిని పట్టుకొనబోవు కిరాతుడు దొంగతనముగ మెల్లగ చప్పుడు కానట్లు అడుగులు వైచుచు ఆపక్షికి కనుపడక మాటుమాటున నుండి సమీపింది దానికి తెలియకుండ అకస్మాత్తుగ దానిని బట్తుకొనిపోవును.

పొంచియుండి కపటముతో తెలియరాకుండ తనయభీష్టము సాధించుకొనుట నీన్యాయము సూచించును.

ఆకసముపై నెగిరిపోవు పక్షియొక్క నీడను గుర్రించుచు అదిపోయిన త్రోవన పోయి కిరాతుడు ఒకచో వ్రాలిన దాని నేర్పుతో పట్తుకొనునట్లు.

భూమిరధిక న్యాయమును, శుప్కేష్టిన్యాయమును జూడుము.

శకునిసూత్రన్యాయము

పక్షి, దానిని పట్తుకొనుట కుపయోగింపబడువల, ఒకచో గూడునవి యైనను పరస్పరభిన్నములు.