పుట:SamskrutaNayamulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
134

సంస్కృతన్యాయములు

శంఖన్యాయము

ఒకరాజభవనములో నొకశంఖము గలదు. అనుదినము నిర్ణీతసమయమునకు నియమితభటు డొక డాశంఖము నూదును. ఆవేళకు సరిగా సేవకు లందఱు హాజరై తమతమపనులలో బ్రవేశింపవలయును. కారణాంతరమున నెన్నడేని నాశంఖము పూరింపబడకపోయినను సేవకులు అదేసమయమునకు అనగా శంఖపూరణవేళ నతిక్రమింపక హాజరై తమపనులలో ప్రవర్తించు;తు. అట్లు ప్రవర్తింపవలయునుగూడ.

అదేవిధమున---"శంఖన్యాయేనోపలక్షకస్యాగ్నీషోమీయపురోడాశస్వైవాభావేz ప్యుపలక్ష్యేకాతే యాగొzస్తి యధా శంఖవేలాయా మాగంతన్య మిత్యాది....."

ఓకపురుతోడాశమున రెండు పురోడాశములు ప్రయోగింపబడవు. ఉద్దిష్ట. ఉరోడాశావసరమున కర్తవ్యయాగ మొండుగలదు. అగ్నీషోమీయపురోడాశము ప్రయోగింపబడక పోయినను తరుపలక్ష్యవము కాలమున వావిహితయాగము నాచరింపవలసి యున్నది.

గంట కొట్టగానే పిల్ల లందఱు బడికి రావలయును. అట్లు వచ్చుచుందురు. ఒకనా డేదేనికారణమున--జవాను రాక కొట్టువేళకే పిల్లలందఱు బడిలోకి వత్తురు; రావలయును గూడ.