పుట:SamskrutaNayamulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
132

సంస్కృతన్యాయములు

జ్ఞానోపదేశ మొక సత్పురుషునియందు మాత్రమే వ్యర్ధము గాక ఫలించును. మూర్ఖునియందు బూడిదలో పోసిన పన్నీరగును.

సింహీక్షీరన్యాయము జూడుము

వ్యాఘ్రోపవాసన్యాయము

"వ్యాఘ్రస్య తూపవాసస్య పారణం పశుమారణమ్"

పులియుపవాసమునకు పారణము పశుశూరణమే, దుష్టుని సవినయానుసరణమునకు పరిణామము ధనమాన ప్రాణాపహరణమే.

వ్యాలనకులన్యాయము పాము, ముంగిస వలె.

పామునకు, ముంగిసకు ఎడతెగని వైరము, అవి రెండు ఒకచో నెన్నడు నుండవు.

ఒకపొలములో రెండు ముంగిసలు తిరుగుచుండెను. ఇంతలో దగ్గఱగానున్న బిలములోనుండి యొక పాము ముంగిసలున్న సన్న గుఱుతింపక వెలికి వచ్చెను. వెంటనే యోక ముంగి దానిపై బడి తునకలు తునుకలుగ కొఱికి వైచెను. కావున వానికిగల సహజవైరవ్యాపారమపారము.

ప్రబలవైరములుగల వ్యక్తుల విషయమున నీన్యాయము ప్రవర్రించును.