పుట:SamskrutaNayamulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
131

సంస్కృతన్యాయములు

వ్యభిచారిణీన్యాయము

వ్యభిచారముచేయు స్త్రీ తనయింటిలో పనులు పాటలు చేసుకొనున్నను తనకిష్టుడవు విటపురుషునే నిరంతరము స్మరించి ఆనందిచుచుండును.

భగవద్ర్పితమైన చిత్తవృత్తిగల మహనీయు డేకర్మలు చేయుచున్నను, ఎటనున్నను మనసా పరబ్రహ్మస్వరూప చింతన మొనరించుచు బ్రహ్మానందము ననుభవించుచునే యుండును.

వ్యాఘ్రచోరధనుర్న్యాయము

పెద్దపులి నెఱచినదిపూలె పొదలలో మాటుగ డాగిపొంచియుండి మృగములపైబడి మడియించును. చోరుడు చీమకైనను నొప్పితగులనట్లు అడుగులు వైచుచు నిలుజేరి యింటిలోనివారికి నిద్రాభంగముచేయ నొల్లని వాని చొప్పున చప్పుడు కాకుండ గోడకు కన్నమువైచి యిల్లు చక్కపెట్తును. ధనుస్సు విషయమున బోలె మొదట వంగియే బాణము విడిచి తోటివానిని సంహరించును. దుర్మార్గుడు అడవకువతో నుండియుండి నమ్మించి ఆషాడభూపతివలె కొంపదీయును.

వ్యాఘ్రీక్షీరన్యాయము

పెద్దపులిపాలు బంగారుగిన్నెలో పోసియుంచినగాని విఱిగిపోక నిలువవు.  బంగారముకన్న నితరములవు లోహముల పాత్రలలలో నవి విఱిగి చెడెపోవును.